![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -135 లో.... చందు బావని కనిపెట్టాలంటే నాదగ్గర ఒక ప్లాన్ ఉందని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. ప్రేమ భద్రవతి కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అత్త అని అంటుంది. దాంతో ప్రేమని కలుస్తుంది భద్రవతి. అదే సమయంలో విశ్వకి ధీరజ్ ఫోన్ చేసి.. మీ అత్తని కిడ్నాప్ చేసానని చెప్తాడు. దాంతో తన ప్లాన్ ఫెయిల్ అయిందని విశ్వ డిస్సపాయింట్ అవుతాడు. ఇప్పుడు మా అన్నయ్యని తీసుకొని రాకుంటే మీ అత్తయ్య ఉండదని విశ్వని బెదిరిస్తాడు ధీరజ్.
ఆ తర్వాత అత్త మనం వేరొక దగ్గరికి వెళ్లి మాట్లాడుకుందామని భద్రవతిని ప్రేమ ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తుంది. ఏంటి ప్రేమ ఏదో మాట్లాడాలి అన్నావని ఆడుగుతుంది. వెనకాలే ధీరజ్ వస్తాడు. మరొకపక్క భద్రవతిని కిడ్నాప్ చేసారని చందుని విశ్వ తీసుకొని ఆ ప్లేస్ కి వస్తాడు. సారీ అత్త నీతో మాట్లాడాలని ఇక్కడికి పిలవలేదు.. విశ్వ అన్నయ్య చందు బావని కిడ్నాప్ చేసాడు. అందుకే ఇలా నాటకం ఆడానని ప్రేమ అంటుంది. చందుని ధీరజ్ తీసుకొని అక్కడ నుండి బయల్దేర్తాడు. సారీ అత్తయ్య అని భద్రవతికి చెప్పి ప్రేమ వెళ్ళిపోతుంది.
మరొకవైపు ఊళ్ళో వాళ్లంతా పెళ్లికి వచ్చి వెళ్లిపోతుంటే అందరిని ధీరజ్ ఆపుతాడు. తన వెంట చందుని తీసుకొని వస్తాడు. జరిగిందంతా రామరాజుకి చెప్తాడు చందు. తమ్ముడు నన్ను కాపాడి మీ పరువు ని కాపాడాడని రామరాజుకి చందు చెప్తాడు. ఆ తర్వాత శ్రీవల్లి, చందుల పెళ్లి జరుగుతుంది. రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |